తీర్పునకు లోబడే ఓఆర్‌ఆర్‌

– టోల్‌ వ్యవహారం నిధుల మళ్లింపు
నవతెలంగాణ -హైదరాబాద్‌
నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నిర్వహణ, టోల్‌ కలెక్షన్‌ల వ్యవహారంపై ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ లిమిలిడ్‌ కంపెనీకి అప్పగిస్తూ హెచ్‌ఎండీఏ చేసుకున్న ఒప్పదాన్ని సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏండ్ల పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నిర్వహణ, టోలు వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడం, రూ6500 కోట్లను ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ బదిలీ చేయడం వంటి అంశాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పింది. ఒప్పందం పారదర్శకత లేదనే పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే బెంచ్‌ బుధవారం విచారించింది. ఇరు పక్షాల వాదనల తర్వాత హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.