సుదీర్ఘపోరాటాల ఫలితమే

– రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ నియామకం
– నూతన చైర్మెన్‌, సభ్యులకు కేవీపీఎస్‌ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సుమారు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌, సభ్యులను సుదీర్ఘ పోరాటాల తర్వాత ఎట్టకేలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు గురువారం కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌ వెస్లీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన చైర్మెన్‌, సభ్యులకు వారు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి పారదర్శకంగా రాజకీయాలకతీతంగా రక్షణ కేంద్రంగా పెద్దదిక్కుగా నిలవాలని కోరారు. చాలా ఏండ్లుగా జరిగిన దాడులు దౌర్జన్యాల ఘటనలను పరిశీలించి బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నూతన చైర్మెన్‌ బక్కి వెంకటయ్య, సభ్యులకు సూచించారు. ది వివిధ సామాజిక సంఘాల సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తూ బాధితులకు బాసటగా నిలవాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.