నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల కంటే ముందే 2016 పీఆర్సీ బకాయిలను చెల్లిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చినట్టు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) తెలిపింది. శుక్రవారం అసోసియేషన్ నాయకులు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రితో సమావేశమై చర్చించారు. త్వరలో ప్రొఫెసర్ల ట్రాన్స్‌ఫర్లు చేపట్టనున్నట్టు కూడా మంత్రి తెలిపారు. మంత్రి సానుకూల స్పందన పట్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్య క్షులు డాక్టర్ కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ ప్రకాష్‌లు ధన్యవాదాలు తెలిపారు.