శ్రీ రామాంజనేయ గణేష్ మండలి ఆధర్యంలో సోమవారం అన్నదానం..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో సోమవారం శ్రీరామాంజనేయ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సర్పంచ్ పాముల సాయిలు తెలిపారు. బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ అమీర్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన కోరారు. తమ గ్రామానికి పదివేల రూపాయల సహాయం అందించిన బోధన్ ఎమ్మెల్యే కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో సాయిలుతోపాటు, గ్రామ యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.