ప్రజల సౌకర్యార్థమే కార్యాలయం నేలకోల్పం

– పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి: డిచ్ పల్లి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సౌకర్యాల మేరకు డిచ్ పల్లి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉపకార్య నిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.కార్యాలయ ఏర్పాటు కోసం సహకరించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి  దయాకర్ రావు కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.రూరల్ నీయోజకవర్గం లోని సిరికొండ, డిచ్ పల్లి మండల గ్రామాలను కలిపి ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయం ప్రజలకు అందుబాటులోకు వచ్చిందన్నారు.నిజామాబాద్ 1 నిజాంబాద్ 2, డిఈ ఆఫీసులో ఉండే, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ కార్యాలను ప్రారంభించడం జరిగిందని, దీన్ని ప్రజలు ముఖ్యంగా కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులు, వారు చేసిన సిసి రోడ్స్, బిల్డింగ్స్ నిర్మాణాలకు పనులను కంప్లీట్ చేసి వాటి యొక్క మెజర్మెంట్, బిల్లింగ్ చేయడానికి అందుబాటులోకి ఈ కార్యాలయం ఉంటుందని సూచించారు.కార్యలయం ఏర్పాటు  ప్రజలకు మరింత సులువుగా మారనుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జెడ్పిటిసి లక్ష్మీ నర్సయ్య, డిఈఈ శంకర్ నాయక్, ఎంపిడిఓ టీవీఎస్ గోపి బాబు, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కర్యధర్శి హరికిషన్ , మోహన్ రెడ్డి, నడిపన్న, షేక్ అమీర్, శక్కెర కొండ కృష్ణ, మోహమ్మద్ యూసుఫ్, చకలి సాయన్న ఒడ్డేమ్ నరసయ్య, అయా గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్లు ఎంపిటిసిలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.