– అక్టోబర్ 4 నుంచి ప్రారంభం.ఎంఆర్‌పీఎస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎస్సీ వర్గీకరణ కోసం ‘మాదిగల విశ్వరూప పాదయాత్ర’ పేరుతో పాదయాత్ర చేయనున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. అక్టోబర్ 4న అలంపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమై…హైదరాబాద్ శివారులో ముగుస్తుందని వివరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసమే తాను పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చారన్నారు. ప్రధాని హామీ ఇచ్చినపుడు కిషన్ రెడ్డి సాక్ష్యంగా ఉన్నారని చెప్పారు. అయితే వర్గీకరణ కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టడం లేదని విమర్శించారు. రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయని, కానీ అమలు చెయ్యడం లేదని విమర్శించారు. ఈ అంశంలో డిక్లరేషన్ చేసినట్టు చెబుతోన్న కాంగ్రెస్… ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు.