వైద్యకళాశాలల్లో సంబురాలు

Samburas in medical collegesనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఎరియర్లు, ప్రొఫెసర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో వైద్యకళాశాలల్లో సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాల్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ అన్వర్‌, సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ మాదాల, కోశాధికారి కిరణ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు. వైద్యులు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు.