నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హస్తకళల ద్వారా అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్న ప్రొఫెసర్ రాంబాబు ముప్పిడి గొప్ప ఆవిష్కర్త అని పలువురు వక్తలు కొనియాడారు. రాంబాబు చేతిలో చెక్క ముక్క పడితే అది ఊహించని విధంగా కళాఖండంగా మారుతుందనీ, ఆ పనితనానికి అక్షరరూపం ఇస్తూ ఆయన రాసిన ‘ హ్యాండీక్రాఫ్ట్స్ యాన్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ డిజైన్’ పుస్తకావిష్కరణ ఎఫ్‌డీడీఐ హైదరాబాద్ ఆడిటోరియంలో జరిగింది. ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహుగారి తేజ్‌లోహిత్ రెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు ముప్పిడి రూపొందించిన పలు హస్తకళాఖండాల్ని వారు పరిశీలించారు. పుస్తకంలోని అంశాలను చర్చించారు. రాంబాబు ముప్పిడి హస్తకళల్ని నిరంతరం అభ్యసిస్తూ, ఆ అనుభవాలను పుస్తకరూపంలోకి తేవడం భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.