లండన్‌లో ఘనంగా గణేశ్‌ శోభాయాత్ర

Ganesh Shobhayatra in Londonనవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ ఫ్రెండ్స్‌ యూత్‌(హెచ్‌వైఎఫ్‌వై)-లండన్‌ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. బుధవారం గణేశ్‌ విగ్రహ శోభాయాత్ర సైతం భారీగా నిర్వహించారు. భారీ ఎత్తున రీడింగ్‌ నగర వీధుల్లో ప్రవాసుల నత్యాలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందు లో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్‌ వాసులూ పాల్గొన్నారు. ఆట పాటలతో సంబరాలు చేసుకున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, జై బోలో గణేష్‌ మహారాజ్‌ కి జై’ అంటూ నినాదాలు చేశారు. సంస్థ అధ్యక్షుడు అశోక్‌ దూసరి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఒక కాస్మోపాలి టన్‌ ప్రాంతం అని, అక్కడ ఎలాగైతే ప్రజలంతా కలిసి మెలిసి ఉంటారో, ఇక్కడ కూడా అలాగే అందరినీ కలుపుకొని ఈ పండుగ జరుపుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. లడ్డు వేలంపాటలో జీవన్‌, సుమన్‌ గోలి, మధు గులాయి కలిసి 1500 పౌండ్లకు దక్కించుకున్నట్టు చెప్పారు. అనంతరం థేమ్స్‌ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు. ఆ సంఘం నాయకులు జాహ్నవి దూసరి, సతీష్‌రెడ్డి, శ్రీకత్‌రెడ్డి జింకల, సుస్మిత, శ్రీనివాస, లక్ష్మి, హర్షరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సుమన్‌ గోలి, నీలిమ, మధు గులైగారి, భావన, జీవన్‌, మమత, మహేందర్‌, శ్వేతా, అనిల్‌, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు.