నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీటిపారుదల రంగ నిపుణులు చెరుకూరి వీరయ్య మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపం వ్యక్తం చేశారు కృష్ణా, గోదావరి జలాల వినియోగం కోసం ఆయన విశేష కృషి చేశారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటిపారుదల కల్పనకు ఆయన తన అనుభవాన్ని వెచ్చించారని పేర్కొన్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.