నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తంగిరాల మెమోరియయల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మక తంగిరాల కృష్ణ ప్రసాద్ 24వ స్మారక రంగస్థల పురస్కారం డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్యకు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు తంగిరాల ట్రస్ట్ బాధ్యులు గోపికృ ష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని ఎంవీఎన్ భవన్లో (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో) సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా నవ తెలంగాణ ఫ్యూచర్స్ ఎడిటర్ కె.ఆనందాచారి, కళారత్న చింతా వెంకటేశ్వర్లు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కె.చంద్రమోహన్, ప్రముఖ కథా రచయిత పుప్పాల కృ ష్ణమూర్తి, తెలంగాణ సాహితీ కోశాధికారి ఏ.మోహన్ కృష్ణ, కవులు సాగర్ల సత్తెయ్య, బి.గోపీకృష్ణ, తంగిరాల ట్రస్ట్ అధ్యక్షులు తంగిరాల చక్రవర్తి తదితరులు పాల్గొననున్నారు. కవులు, రచయితలు, సంగీతకారులు హాజరై తెలంగాణకు గర్వకారణంగా నిలిచి కేంద్ర ప్రభుత్వ జాతీయ పురస్కారం పొందిన పురుషోత్తమాచార్యను అభినందించనున్నారు.