నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీ అక్టోబర్ 3వ తేదీ నిజామాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారంనాడామె ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అదనపు డీజీ స్వాతి లక్రా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఎన్టీపీసీ, బీఎస్ఎన్ఎల్, అగ్నిమాపక, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఆరోజు ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు.