– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ చైర్మెన్ ఇచ్చిన వివరణే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో స్పష్టమైన లెక్క ప్రకటించకపోవటంలో అర్థమేంటని ప్రశ్నించారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమీషన్ కి వచ్చిన నష్టమెంటో అర్థం కావటం లేదని పేర్కొన్నారు.