అనాధ బాలుడికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ- రామారెడ్డి :
అనాధ బాలుడికి స్థానిక ఎంపీటీసీ ఉమాదేవి దత్తాద్రి ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన సూరంపల్లి శ్రీనివాస్ ఇటీవల వ్యక్తిగత గొడవలతో ఆత్మహత్య చేసుకోగా, భార్య అంతకంటే మూడు నెలల ముందే అనారోగ్యంతో మృతి చెందగా కుమారుడు సాత్విక్ అనాధగా, నానమ్మ వద్ద ఉంటూ ఆరవ తరగతి చదువుతుండగా బాలుడి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయని తెలుసుకొని స్థానిక ఎంపిటిసి ఉమాదేవి దత్తాద్రి ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.