సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు

– అధికారులకు వినతులు
నవతెలంగాణ- విలేకరులు
సమస్యల పరిష్కారం కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాదన్‌నగర్‌లో చేపట్టిన సమ్మెకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనునాయక్‌ మద్దతు తెలి పారు. ఆయన ఆధ్వర్యంలో ఫరూఖ్‌నగర్‌ తహసీల్దార్‌ పార్థసారధికి వినతి పత్రం అందజేశారు. మంచాలలో సమ్మెకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. కరీంనగర్‌ జిలా శంకరపట్నం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాస్తారోకో చేశారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌, కోదాడ మండలాల్లో మధ్యాహ్నభోజన కార్మికుల సమ్మె కొనసాగింది. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నభోజన కార్మికులు చెవిలో పూలుపెట్టుకొని నిరసన తెలిపారు.