గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే గండ్ర

నవతెలంగాణ-మొగుళ్ళ పల్లి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.శనివారం మండలంలోని ఇస్సిపేట,పాత ఇస్సిపేట, చింతలపల్లి, మొగుళ్ళ పల్లి, వేములపల్లి, గుడిపహాడ్‌, ఎల్లారెడ్డి పల్లె, రంగాపురం గ్రామాల్లో సిసి రోడ్డు,వివిధ కులాల కమ్యూనిట్‌ హాల్‌, నూతన గ్రామ గ్రామ పంచాయతీ భవనాలు,రైతు వేదిక, బిటి రోడ్డు,బ్రిడ్జి,అదనపు తరగతులను సుమారు 11 కోట్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన,ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రంగాపురం గ్రామంలో సర్పంచ్‌ బలుగూరి తిరుపతి రావు అధ్య క్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. రైతులను సంఘటితం చేయడానికి రైతు వేదికలు నిర్మించడం జరిగిందన్నారు. పట్టణాలకు అతీతంగా గ్రామాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలిచారని కొనియాడారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసిన నాయకులను ఆదరించాలని కోరారు. అనంతరం రంగాపురం గ్రామానికి చెందిన సూర రాజయ్య, శ్రీరాం శ్రీనివాస్‌ ఇటీవల మరణించగ వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరమార్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి సుజాత సంజీవరెడ్డి, జెడ్పిటిసి సదయ్య, చిట్యాల ఏ ఎం సి చైర్మన్‌ కొడారి రమేష్‌,పిఏసీఎస్‌ చైర్మన్‌ నరసింగరావు, వైస్‌ ఎంపిపి రాజేశ్వర్‌ రావు,సర్పంచ్‌ ల ఫోరం మండల అధ్యక్షులు చదువు అన్నారెడ్డి, ఎంపిటీల ఫోరం మండల అధ్యక్షులు సుధాకర్‌, సర్పంచ్‌ లు కొడారి సునీత, ధర్మారావు, సరళ శ్రీనివాస్‌, సమ్మక్క మహిపాల్‌,మాధవి శ్యాంసుందర్‌ రెడ్డి, స్వరూప పర్వతాలు, రాజేందర్‌ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్‌ లు, ఎంపిటీలు, కార్యకర్తలు,ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.