పలు గ్రామాలలో స్వచ్చాభారత్

నవతెలంగాణ – జుక్కల్ :మండలంలోని పలు గ్రామాలలో స్వచ్చాభారత్ కార్యక్రమాలు నిర్వహించడం జర్గింది. ఈ సంధర్భంగా జుక్కల్ మండలంలోని  బస్వాపూర్ సర్పంచ్ రవిపటేల్, పెద్ద ఎడ్గి సర్పంచ్ వినోద్ మరియు 28 జీపీలలో స్వచ్చా భారత్ కార్య క్రమంలో  భాగంగా రోడ్లన్ని ఉడ్చివేయడం, మురికి కాలువల వద్ద ఉన్న చెత్త చేదారాన్ని తోలగించడం, విధులలో పరిశుభ్రత పాటీంచే విధంగా గ్రామస్తులతో కలిసి స్వచ్చాభారత్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విధులలో తిరిగి స్వచ్చాభారత్ పాటీంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు ,తదితరులు పాల్గోన్నారు.