సమస్యలు పరిష్కరించాలని.. అంగన్‌వాడీల రాస్తారోకో

ఊట్కూర్‌: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆదివారం 21వ రోజు సమ్మెలో భాగంగా మక్తల్‌లోని అంతర్‌ రాష్ట్ర రహదారిపై అంబేద్కర్‌చౌక్‌లో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జీ. వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 వేల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అంగన్వాడీలు పనిచేస్తున్నారన్నారు. గత 20 రోజుల నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవరిస్తుందని ఆరోపించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ప్రాజెక్టులోని అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్‌, మినీ టీచర్స్‌ నిర్వాధిక సమ్మెలో సెంటర్లు తాళాలేసి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచే స్తున్నారని, వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలు పైగా ఐసీడీఎస్‌ లో పనిచేస్తూ పేదలకు సేవలందిస్తు న్నారన్నారు. కనీస వేతనం,పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యలేవి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించకపోవడం దారుణమని అన్నారు. తమిళనాడు, పాండిచేరి రాష్ట్రాలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడ అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ చట్టబద్ధ సౌకర్యాలు కల్పించారని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీి ఉద్యోగులను వెట్టి చాకిరీ చేయించుకుంటూ అదనపు పనులు అప్పగిస్తూ బీఎల్‌ఓ డ్యూటీ లో నుంచి మినయించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, బలవంతంగా అంగన్వాడీ సెంటర్లను తాళాలను ధ్వంసం చేసి పంచా యతీ కార్యదర్శులతో సెంటర్లను కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, పింఛన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యువిటీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మినీ అంగన్వాడీి సెంటర్‌ లను మెయిన్‌ సెంటర్లుగా గుర్తిస్తూ ప్రకటించిన సర్కులర్‌ను వెంటనే జారీ చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణం లక్ష్మి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పీఆర్సీ ఏరియర్స్‌ 2021 జూలై, అక్టోబర్‌, నవంబర్‌ మూడు నెలలకు సంబంధించి వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనియన్‌ తో చర్చలు జరిపి అంగన్వాడీ ఉద్యోగుల నిర్వాదిక సమ్మెను విరమింపజేయాలని కోరారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ పుంజునూరు ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ గోవింద్‌ రాజ్‌, ఉట్కూర్‌ మండల నాయకులు నారాయణ, కాంగ్రెస్‌ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి , నాయకులు గోపాల్‌ రెడ్డి, రవి, గద్వాల్‌, జీ. రవి కుమార్‌ యాదవ్‌, మామిళ్ల ఆంజనేయులు, చందపురం రాములు రవికుమార్‌ , ప్రాజెక్టు అధ్యక్షురాలు డీ. విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి జమున, ఉపాధ్యక్షురాలు యశోద , సహాయ కార్యదర్శులు ఎస్‌ మంజుల, శ్రీలత, రాధిక , భాగ్యలక్ష్మి గిరిజ, సుకన్య, సునీత మల్లమ్మ భాగ్యమ్మ, సురేఖ, వెంకటమ్మ మినీ టీచర్‌ లింగమ్మ, రేవతి, శ్రీలత, కే చంద్రకళ, మణెమ్మ,, రామేశ్వరి, ముంతాజ్‌ బేగం తదితరులు పాల్గొన్నారు.
కోస్గి: రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ , రైతు సంగం జిల్లా కార్యదర్శి అంజిలయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని శివాజీ చౌరస్తాలోని మహబూబ్‌నగర్‌ – తాండూర్‌ ప్రధాన రహదారిపై అంగన్వాడీ ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ 48 సంవత్సరాల పాటు అంగన్వాడీలు ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేస్తున్న కనీస వేతనంకు నోచుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం రూ. 26వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. రిటై ర్మంట్‌ బెనిఫిట్‌ రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్ర మంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్‌, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్‌, అంగన్వాడి యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శశికళ, పుష్ప, ప్రసన్న, చంద్రకళ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.