
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సోమవారం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ నాయకులు కామ్రేడ్ పద్మ సంతాప సభ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అంకితమైన వడ్డెన్నకు అన్నిటా తానున్నానని, ఆయనను ముందుకు నడిపించిన పద్మ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, పద్మ కుమారుడు కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.