
-ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని ప్రశ్నించే గొంతులకు భయపడుతున్నారు
-ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్
నవతెలంగాణ- కంఠేశ్వర్:
జి జి కాలేజీ అభివృద్ధి కోసం మోడీ 100 కోట్లు నిధులు కేటాయించాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మోడీ వస్తున్నందున విద్యార్థి సంఘ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీనిని ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. మోడీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నందున ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం అంటే మోడీ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతులంటే భయపడుతున్నారని ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. గిరిరాజ్ కాలేజీకి వస్తున్న మోడీ జి జి కాలేజ్ అభివృద్ధి కొరకు 100 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ జిల్లాకు నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ఫెలోషిప్‌ల విషయంలో తెలంగాణ రాష్ట్రం పై సవతి ప్రేమ చూపడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంతో డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉందని అనేక నివేదికలు తెలుపుతున్న పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించమంటే అరకొర నిధులు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోడీ అంటు నినదించారు. జి జి కళాశాల కు 100 కోట్లు విడుదల చేసి సభ నూ నిర్వహించుకోవలని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ విగ్నేష్, బొడ అనిల్ నగర అధ్యక్ష కార్యదర్శులు వాగ్మరే విశాల్ , మహేష్ , ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి, సందీప్ తదితరులు ఉన్నారు. అరెస్ట్ అయినా వారిని వెంటనే విడుదల చేయాలి అని విద్యార్థి సంఘ నాయకుడు డిమాండ్ చేశారు.