నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టిన తర్వాతే బదిలీలు నిర్వహించాలని టీఎస్టీయూ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పదోన్నతుల షెడ్యూల్‌ను మార్చి ఎస్జీటీ సమాంతర క్యాడర్ బదిలీలు చేపట్టాలని నిర్ణయించడం సరైంది కాదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీలు మాత్రమే చేపడితే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. న్యాయస్థానం ప్రత్యేక అనుమతి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పదోన్నతుల అనంతరమే బదిలీలు నిర్వహించాలి : టీటీయూ
ఉపాధ్యాయులకు పదోన్నతుల అనంతరమే బదిలీలు నిర్వహించాలని టీటీయూ అధ్యక్షులు ఎం మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏరుకొండ నరసింహస్వామి డిమాండ్ చేశారు.