కుటుంబ పెన్షన్‌ 30 శాతానికి పెంచాలి

– ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలలో జాయింట్‌ ఫోరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కుటుంబ పెన్షన్‌ ను 30 శాతానికి పెంచాలని నేషనల్‌, న్యూ ఇండియా, ఓరియంటల్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలలో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగుల జాయింట్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. బుధవారం ఫోరం ఆధ్వర్యంలో బషీర్‌ బాగ్‌లోని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ రీజినల్‌ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో జంట నగరాలలో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం వాటాను ఎన్‌పీఎస్‌ ఉద్యోగులకు 14 శాతానికి పెంచాలనీ, పెన్షన్‌ అప్డేషన్‌ సదుపాయం కల్పించాలనీ, ఉద్యోగులందరికీ 1995 పెన్షన్‌ స్కీం లోకి తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్‌ఎఫ్‌జీఐఇ ఆల్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి పీ.ఎస్‌.బాజ్‌ పేయి, జీఐఇఏఐఏ హైదరాబాద్‌ బ్రాంచి ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, జీఐపీఏ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ విజయ భాస్కర్‌ రెడ్డి, హెచ్‌ఆర్‌ జీఐఇఏ ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు, ఎస్‌సీజెడ్‌ఐఇఎఫ్‌ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య, ఒఐసీఓఏ అధ్యక్షులు సబింద్రసింహ, వై సుధాకర్‌ రావు, జీఐపీఏ నాయకులు శంకరనారాయణ, హెచ్‌ఆర్‌జీఐఇఏ ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు తదితరులు ప్రసంగించారు.