గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

Transfers and promotions of tribal welfare teachers should be undertaken– టీఎస్‌యూటీఎఫ్‌ నేతలు చావ రవి, జంగయ్య డిమాండ్‌
– సంక్షేమ భవన్‌ను ముట్టడించిన టీచర్లు
– గిరిజన సంక్షేమ ప్రధానోపాధ్యాయు ల సంఘం మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌ చేశారు. పాఠశాల విద్యాశాఖలో చేపట్టినట్టుగానే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు ఖం డించారు. బుధవారం టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలొచ్చి ఆందోళన చేపట్టారు. ‘విరు వాంట్‌ ప్రమోషన్స్‌, ట్రాన్స్‌ఫర్స్‌, పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలి, గిరిజన ఉపాధ్యా యుల సమస్యలను పరిష్కరిం చాలి, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధి ల్లాలి’ అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనకు గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా చావ రవి, జంగయ్య మాట్లాడుతూ గిరిజన ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల విషయంలో కమిషనర్‌ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 1,800 పాఠశాలల్లో ఆరు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. ప్రతిసారీ పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన సందర్భంలో నే గిరిజన ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తున్నా రని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలోనే విద్యా శాఖ జీవో విడుదల చేసినా, ఇప్పుడు బదిలీలు జరు గుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మాత్రం నిమ్మకు నీరె త్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించా రు.ఐదేండ్లుగా బదిలీల్లేక అవసరమైన ఉపాధ్యాయు లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పదోన్నతుల్లేక పోవటంతో అర్హతగల ఉపాధ్యాయులు నష్టపోతున్నా రనీ, విద్యార్థులు ఇబ్బంది కలుగుతున్నదని అన్నారు. గతే డాది జనవరి నుంచి టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వ ర్యంలో అనేక ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ రాసినప్పటికీ గిరిజన సంక్షేమ కమి షనర్‌ స్పందించకపోవటం విచారకరమని చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ ఎన్నికల ప్రకటన వెలువడకముందే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయా లని డిమాండ్‌ చేశారు. టీఎస్‌ యూటీఎఫ్‌ కోశాధి కారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శాంత కుమారి, నాయకులు లావణ్య, కిషోర్‌ సింగ్‌, పి నాగేశ్వర రావు, ఎన్‌ కృష్ణ, వాసుదేవరెడ్డి, రాందాస్‌, బాలు, భద్రు, అనసూయ, డి నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యా యులు చందన్‌, సనత్‌ కుమార్‌ శాస్త్రి పాల్గొన్నారు.