నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీ చైర్మెన్ ఎన్ శివ శంకర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ నేతృత్వంలో కలిశారు. ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడంలో నూతన పీఆర్సీ కమిటీ కృషి చేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను అనుసరించి అలాగే వివిధ శాఖల ఉద్యోగుల వేతన స్థిరీకరణ, మెరుగైన ఫిట్‌మెంట్ ఫార్ములాను రూపొందించేలా పీఆర్సీ నివేదిక ఉండాలని సూచించారు. అలాగే గడువులోగానే నివేదికను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముజీబ్, విక్రమ్, వివిధ జిల్లాల నాయకులు లక్ష్మణ్, శ్రీకాంత్, హరికృష్ణ, శ్రవణ్, కిరణ్, నర్సింహులు, గౌస్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ రావు, రాజుకుమార్, కొండల రెడ్డి, శైలజ, గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.