నవ తెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతన సమావేశ గదిని ప్రారంభించి బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే షకీల్ అమీర్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. నూతనంగా నిర్మించిన సమావేశపు గది ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంఘం శ్రీనివాస్, జడ్పిటిసి సవిత బుచ్చన్న,వైస్ ఎంపీపీ ఇందూరు హరీష్, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.