నవతెలంగాణ- మోపాల్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపాల్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల కంజర్ నందు కిషోర్ బాలికలకు సానిటరీ నాప్కిన్స్ తో కూడిన హైజిన్ కిట్స్ ను పంపిణీ మరియు పోషకాహారం, చేతుల పరిశుభ్రత మరియు ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు మోపాల్ మండల శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ ఘన్పూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ డివిజన్ రెడ్ క్రాస్ చైర్మన్ మరియు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీశైలం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ శ్రీ బుస్సా ఆంజనేయులు, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మేంబర్ తోట రాజశేఖర్, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి కరిపే రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీశైలం గారు మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారము, వ్యక్తిగత పరిశుభ్రత, సానిటరీ నాప్కిన్స్ తయారీ మరియు వాడే విధానము పై అవగాహన కల్పించారు. జిల్లా రెడ్క్రాప్ చైర్మన్ భుస్సాఆంజనేయులు గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవా భావాన్ని అలవర్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు, తోట రాజశేఖర్ గారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ పుట్టుక జిల్లా, రాష్ట్ర, దేశ మరియు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ కార్యక్రమాలు పై అవగాహన కల్పించారు. రెడ్ క్రాస్ మోపాల్ మండల్ చైర్మన్ శ్రీ ఘన్పూర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యం పై అవగాహన మరియు చేతుల శుభ్రత పై చేతులు కడిగే విధానంపై అవగాహన కలిగించారు. జిల్లా కోశాధికారి కరిపే రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులంతా విద్యార్థి దశ నుండే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత గారు మరియు సిబ్బంది విద్యార్థినిలు పాల్గొనగా రెడ్ క్రాస్ ముఖ్య అతిధులు జిల్లా చైర్మన్ ఆంజనేయులు మరియు డాక్టర్ శ్రీశైలం చేతుల మీదుగా హై జిన్ కిట్స్ సుమారు 70 మంది విద్యార్తినిలకు పంపిణీ చేయడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేశారు.