గ్రామాల అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే

నవతెలంగాణ-రేగొండ
గ్రామాల అభివృద్ధే సర్కార్‌ లక్ష్యం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం గోరుకొత్తపల్లి మం డలంలోని జగ్గయ్యపేట గ్రామంలో ఆర్‌అండ్‌బి రోడ్డు వెంబడి సైడ్‌ డ్రైనేజీలకు రూ.50 లక్షలు, సుల్తాన్పూర్‌ గ్రామాల్లో ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఇరువైపులా సైడ్‌ డ్రైనేజీ లకు రూ.40 లక్షలు నిధులు మంజూరు కాగా శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.జంషెడ్‌ బేగ్‌ పేట, సుల్తా న్పూర్‌ గ్రామాల మధ్య లో లెవెల్‌ వంతెన పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం గోరుకొత్తపల్లి నూతన మం డలంలో తాసిల్దార్‌ కార్యాలయానికి, ఒక కోటి 40 లక్షలు నిధులు మంజూరు కాగా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రాతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్‌ సుదనబోయిన రజిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నేడు పల్లెలు పట్టణాలకు దీటుగా అభివద్ధి చెందుతున్నాయని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మాట్లాడుతూ రైతులు ఎలాంటి అధైర్యపడవద్దని రానున్న రోజుల్లో నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించేం దుకు కృషి చేస్తానని అన్నారు. 50 సంవత్సరాలుగా అసైన్డ్‌ భూములకు పట్టాలు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు పట్టాలను ఇచ్చారని అన్నారు. యువతకు కెసిఆర్‌ కిట్టును, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్‌ ఉమాశంకర్‌, ఆర్డీవో రమాదేవి, ఎంపీడీవో సురేందర్‌ తాసిల్దార్‌ రవి, ఎంపీపీ లక్ష్మి రవి, జెడ్పీటీసీ విజయముత్యం, ఎంపీటీసీ హమీద్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు మటక సంతోష్‌, సర్పంచులు పాత పెళ్లి సంతోష్‌, అంబాల చందు, ఐలయ్య, నాయకులు తిరుపతిరావు, రాజు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.