విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

– కలెక్టర్‌ కె.శశాంక్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌
నవతెలంగాణ-మరిపెడ
ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచాలని ఉ పాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ కె.శశాంక్‌ ఆదేశించారు. శుక్ర వారం మరిపెడ మున్సిపాలిటి కేంద్రంలో జిల్లా పరిషత్‌ సె కండరీ పాఠశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రవేశ పెట్టిన సిఎం అల్పహర పథకం, ప్రారంభోత్సవా నికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక, డోర్నకల్‌ ఎమ్మెల్యే డియస్‌ రెడ్యా నాయక్‌, హాజర య్యారు. విద్యార్థులతో కలిసి సీఎం అల్పాహారం పథకాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి ప్రవేశపెట్టిన ఈ ప థకాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలన్నారు. విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వ ఉద్యో గులు సమయపాలన పాటించలన్నారు. విధులకుడుమ్మా కొడుతున్న వారిపై ఫిర్యాదులు వస్తున్నాయని వారి పైన త గిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పిల్లల హాజరు శాతం తగ్గితే ఉపాధ్యాయులదే బాధ్యత అని ఎమ్మె ల్యే రెడ్యానాయక్‌ అన్నారు. విద్యార్థులకు తెలంగాణ ప్రభు త్వం మార్నింగ్‌ అల్పాహారం, మధ్యాహ్నం మంచి భోజనం అందిస్తుందన్నారు. అంతకుముందు కలెక్టర్‌ పాఠశాలల్లోని వంట పరిసరాల ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. వారి వెంట మహబూబాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్‌ గుడిపూడి నవీన్‌ రావు, మున్సిపల్‌ చైర్మన్‌ సింధూర ర వి నాయక్‌, వైస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, ఎంపిపి అరుణ రాం బాబు, జెడ్పిటిసి శారద రవీందర్‌, తహసిల్దార్‌ సైదులు, మున్సిపల్‌ కమిషనర్‌ ఏ.రాజు, సీడిపిఓ శీరిష, జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు, ఎంఈఓ బుక్య ఫుల్‌ చంద్‌, కౌ న్సిలర్లు, పాఠశాల అధ్యాపక బృందం, బీఆర్‌ఎస్‌ నాయకు లు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
తొర్రూర్‌ రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అల్పాహార పథ కానికి శ్రీకారం చుట్టారని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజ య్య, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్‌లు అన్నారు. శుక్రవా రం మండలంలోని మాటేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకాన్ని ఎంపీపీ, జెడ్పీటీసీలు ప్రారంభించారు. పాఠశాల హెచ్‌ఎం కొండేటి ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహిం చిన సమావేశంలో ఎంపీపీ,జెడ్పీటీసీలు మాట్లాడుతూ ఇప్ప టికే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భో జనంతో చిన్నారుల ఆకలి తీరుస్తుండగా, ఇక నుంచి ఉద యం వేళలో అల్పాహారం అందించేందుకు నిర్ణయం తీసు కుందని తెలిపారు. వారంలో రోజుకోక అల్పాహారం విద్యా ర్థులకు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఇట్టె శ్యామ్‌ సుందర్‌రెడ్డి, సర్పంచ్‌ వల్లపు శోభ యా కయ్య, సిడిపిఓ హైమావతి సూపర్వైజర్‌ జలగం సునీత, ఉప సర్పంచ్‌ పినాకపాణి, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ రా జు, జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు లేగల వెంకట్‌ రెడ్డి, గ్రా మ కార్యదర్శి నాగేష్‌,వార్డు సభ్యులు మహంకాళి అశోక్‌, ఉ ప్పలయ్య,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్‌: కేసముద్రం మండలం తాళ్లపూ సపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ము ఖ్యమంత్రి అల్పాహారం పథకంను మహబూబాబాద్‌ శాసన సభ్యులు బానోత్‌ శంకర్‌ నాయక్‌, మహబూబాబాద్‌ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళ పల్లి రవీందర్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ విద్యా విధానంలో సములా మార్పులు తెచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చే స్తున్న ప్రతి పని అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని ప్రతి విద్యార్థి మంచిగా చదివి భవిష్యత్‌లో గొప్ప స్థానానికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల పూసపల్లి గ్రామ సర్పంచ్‌ రావుల విజిత రవిచంద్రర్‌ రెడ్డి, జెడ్పిటిసి రావుల శ్రీనాథ్‌ రెడ్డి, కేసముద్రం మార్కెట్‌ చైర్మన్‌ నీలం సుహాసిని దుర్గేష్‌, అదనపు కలెక్టర్‌, ఎంపీడీవో, గ్రామ ఉపసర్పంచ్‌, మండల, అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.