రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మగ్గిడి పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ ఆర్మూర్: రాష్ట్రస్థాయి అండర్ 14, అండర్ 17 టోర్నమెంట్ కి మగ్గిడి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత శనివారం తెలిపారు. గత నెల వేల్పూర్ మండలంలోని పడగల్ లో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 ,14 బాల బాలికల జోనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ లో అత్యున్నత ప్రతిభ కనబరిచి కామారెడ్డి, నిజామాబాద్ కంబైన్డ్ జిల్లా సెలక్షన్స్ లో సెలెక్ట్ కాబడి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి ఎంపిక అయినట్టు తెలిపారు. అండర్ 14 లో విజ్ఞత, రిషి ప్రియ, హిమ తేజ, సాయి చరణ్,  అండర్ 17 ల నిషిత లో ఎంపికైనట్టు తెలిపారు. వీళ్ళందరూ రాబోయే రాష్ట్రస్థాయిలో అండర్ 17, 14 వారి వారి కేటగిరీలో పాల్గొంటారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం పీఈటి మధు  తదితరులు హర్షం వ్యక్తం చేసినారు.