డోంగ్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ మద్నూర్:
డోంగ్లి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో శనివారం నాడు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద కుటుంబాలకు వరం లాంటిదని తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏనా బోరా, మల్లాపూర్, తదితర గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పార్టీ నాయకులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు మండల తాసిల్దార్ తదితరులతోపాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.