బహుజన బిడ్డను ఆశీర్వదించండి

– నాగర్‌ కర్నూల్‌ లో జరిగిన అభివద్ధిలో ప్రత్యేకత ఏమీ లేదు
– జనసేన నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ అభ్యర్థి వంగ లక్ష్మణ్‌ గౌడ్‌
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
అత్యధిక సామాజిక వర్గంకు చెందిన బీసీి బిడ్డగా మీ ముందుకు వచ్చాను. మనమెంత మందిమో అంత వాటా ఇవ్వకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు న్యాయం జరగాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారం తా ఈ ప్రాంతానికి వరగబెట్టిందేమీ లేదు. అందుకే వంగ వంశం నుండి వచ్చిన నాకు అత్యధిక ఓట్లను వేసి గెలిపించాలని జనసేన పార్టీ నాగర్కర్నూల్‌ అభ్యర్థి వంగ లక్ష్మణ్‌ గౌడ్‌, కోరారు. నాగర్‌ కర్నూల్‌ లో జరిగిన అభివద్ధిపై సమీక్షించడానికి నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక కారిడార్‌ యాడికి పోయిందని విమర్శించారు. కాగితం పరిశ్రమ కాటన్‌ సిమెంటు చేనేత వంటి అనేక పరిశ్రమలకు అవకాశాలు ఉన్నప్పటికీ నాయకులు విస్మరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌ కర్నూల్‌ లో నిర్మించిన ట్యాంక్‌ బండ్‌ సిసి రోడ్ల తోనే అభివద్ధి పూర్తి కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాగర్‌ కర్నూల్‌ రెడ్డి ప్రాంతానికి ఏమైనా తెచ్చాడా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాల తర్వాత స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడ ఐదు రూపాయలకే అన్నం అనే ఆలోచన ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు పూర్తి కగానే సమస్యలను విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు. బహుజన రాజ్యం కోసమే తన తపన తప్ప వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడం తన ఉద్దేశం కాదన్నారు. నేను పూర్తి చేయడం ద్వారా బీసీ సామాజిక వర్గాలలో ఏ మేరకు చైతన్యం వచ్చినా నైతికంగా విజయం సాధించినట్లేనని గుర్తు చేశారు. రాజ్యం గుర్తుపెట్టుకొని అటువంటి రాజ్యాన్ని బీసీలు అస్తగతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.