రాహుల్‌పై బీజేపీ అనుచిత పోస్ట్‌కు కాంగ్రెస్‌ అందోళన

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీజేపీ పెట్టిన అనుచిత పోస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. శనివారం గాంధీభవన్‌ నుంచి నాంపల్లి చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వ హించారు. అక్కడ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసు లకు, కాంగ్రెస్‌ కార్యకర్త లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా డీసీసీ అధ్యక్షులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, నాంపల్లి ఇంచార్జి ఫిరోజ్‌ఖాన్‌ మాట్లా డుతూ రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.