గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తగిన కృషి చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్‌, అధ్యక్షులు గ్యార పాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, కార్యదర్శి పి సుధాకర్‌ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెండో పీఆర్సీ చైర్మెన్‌గా ప్రభుత్వం నియమించిన ఎన్‌ శివశంకర్‌కు ఈ సందర్భంగా వారు అభినందనలు తెలి పారు. గ్రామ పంచా యితీల్లో పనిచేస్తున్న పర్మినెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు మల్టీపర్పస్‌ వర్కర్‌ పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల వేతనాల పెంపు, ఇతర ముఖ్యమైన అంశాలను పీఆర్‌సీ కమిటీకి తెలియజేసేందుకు యూనియన్‌కు తగిన సమయం ఇవ్వాలని కోరారు.