10న హాజరు కావాలి నటుడు నవదీప్‌కు ఈడీ సమన్లు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మాదక పదార్థాల కేసులో 10వ తేదీన తమ ఎదుటన హాజరు కావాలంటూ నటుడు నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. ఇటీవలన సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదా పూర్‌లో డ్రగ్స్‌తో కొందరు పోలీసు లకు చిక్కారు. అందులో పట్టుబడ్డ రామ్‌దత్‌ అనే వైజాగ్‌ నివాసి ఈ డ్రగ్స్‌ తన స్నేహితుడైన నటుడు నవదీప్‌కు ఇచ్చినట్టు కేసు దర్యాప్తు జరిపిన సిట్‌ అధికారులకు వెల్లడిం చాడు. దాంతో నవదీప్‌ను సిట్‌ అధికా రులు పిలిచి విచారించారు. తాజాగా ఈ కేసును దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు నవదీప్‌ను విచారిం చటానికి నిర్ణయించారు.ముఖ్యంగా, ఈ మాదక పదార్థాల క్రయవిక్రయాలలో మనీలాండరింగ్‌ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో నవదీప్‌ను కూడా విచారించడానికి ఈడీ అధికారులు సన్నాహాలు పూర్తి చేసినట్టు తెలిసింది.