నాలుగు రైళ్లు పొడిగింపు

– 9 నుంచి అమల్లోకి…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 9న వీటిని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి జెండాఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఆరోజు నుంచే ఈ పొడిగింపు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. హడప్సర్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు , జైపూర్‌ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూలు సిటీ వరకు , నాందేడ్‌ – తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను రాయచూర్‌ వరకు, కరీంనగర్‌ – నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకు పొడిగించినట్టు వివరించారు. ఈ రైళ్లలోని సేవలు పొడిగించిన ప్రాంతాల వరకు అన్నీ తరగతుల్లో బుకింగ్స్‌ ప్రారంభమైనట్టు తెలిపారు.