ఎల్లారెడ్డిలో బీజేపీ జండా ఎగరవేస్తాం …బాణాల లక్ష్మరెడ్డి

నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి  నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా బాణాల లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు దెగ్గర పడుతున్న సందర్భంగా కార్యకర్తలు అందరూ సైనికుల వలే పాటు పడాలి అని ఎల్లారెడ్డి లో కాషాయ జెండా ఎగురవేయాలి అని అన్నారు. దేశం బాగు గురుంచి ఆలోచించే ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీరైతుల బాగు గురుంచి ఆలోచించి పసుపు బోర్డు ప్రకటించిన మోదీ ,మహిళా బిల్లు ద్వారా దేశ ఆడపడుచులకు సముచిత స్థానం కల్పించారు.విశ్వకర్మల కోసం విశ్వకర్మ యోజన పథకం, ట్రైబల్ యూనివర్సిటీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి అని అన్నారు.కావున అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ  ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని గడప గడపకు తీసుకెళ్తే భారీ మెజారిటీతో బీజేపీ  గెలుపు ఖాయం అని అన్నారు. అనంతరం  “మేరీ మిట్టి-  మేరీ భారత్” కార్యక్రమంలో భాగంగా గాంధారి పట్టణంలో ర్యాలీగా వెళ్ళి మట్టిని సేకరించారు. పసుపు బోర్డు ప్రకటించించినందుకు గాను బస్ స్టాండ్ సమీపంలో మోదీ  చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కిషన్ రావు , అసెంబ్లీ కన్వీనర్ లింగారావ్ , జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రావు , గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కాట్రోత్ రవి , దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కిష్టయ్య , జిల్లా అధికార ప్రతినిధి  మర్రి బాలకిషన్ గాంధారి బీజేపీ మండల అధ్యక్షుడు చీమల్ వార్ సాయిబాబా, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు , జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.