మే 22న మెగా జాబ్‌ మేళా

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
టీఎస్‌ స్టెప్‌ (తెలంగాణ స్టేట్‌ సొసైటీ ఫర్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రమోషన్‌) ఆధ్వర్యంలో. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌ వద్ద ఈనెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్న ”మెగా జాబ్‌ మేళా” వాల్‌ పోస్టర్‌ను గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌లు రాష్ట్ర నూతన సెక్రటేరియట్‌లో మంత్రి చాంబర్‌ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 100కు పైగా కంపెనీలు పాల్గొననుండడం, 10 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సంప్రదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.