పట్టణంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

నవతెలంగాణ ఆర్మూర్ :  పట్టణ కేంద్రంలో గల రంగాచారి నగర్ కాలనీలో సిద్దాపురం పాపన్న (50) ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  పట్టణ కేంద్రంలోని రంగాచారి నగర్ లో మున్నూరు కాపు కులానికి చెందిన సిద్దాపురం పాపన్న కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటాడు. శనివారం రాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో మృతుడికి బలమైన గాయాలు తగిలి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంట్లో జరిగిన గొడవల్లోని సిద్దాపురం పాపన్నను మర్డర్ చేసినట్లు రంగాచారి నగర్ లోని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మృతుడు సిద్దాపురం పాపన్న శవం ఇంటి పక్కన రోడ్డుపై పడి ఉంది. మృతుడి నుదుటి, కడుపు, వృషణాల దగ్గరలో గాయాలయ్యాయి. మృతుడికి భార్య భూదేవి, కూతురు రవళిలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ లో సిద్దాపురం పాపన్న మృతి చెందిన స్థలాన్ని మొదట  స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు, ఎస్సై లు, పోలీసులు పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రానికి చెందిన క్లూస్ టీం పోలీస్ బృంద సభ్యులు, డాగ్ స్క్వాడ్ తనిఖీ పోలీసులు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీలు ఇచ్చే పట్టారు. ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి సిద్దాపురం పాపన్న మృతి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.