నవతెలంగాణ- రామారెడ్డి : మండలంలో రాజమ్మ తండాలో ఆదివారం నాటు సార స్థావరాలపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు దాడి చేసి. రాజమ్మ తండా కు చెందిన గంగావత్ గోపాల్ ఇంట్లో 6 లీటర్ల నాటు సారా, నాటు సారా తయారు చేసే సామాగ్రిని పట్టుకొని, అక్కడే ధ్వంసం చేసి, గోపాల్ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు. దాడిలో స్థానిక ఎస్ఐ సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.