ఉపాధ్యాయుడు నాగేందర్‌కు బెస్ట్‌ టీచర్‌ అవార్డు ప్రధానం

నవతెలంగాణ-మట్టెవాడ
నగరంలోని రంగశాయిపేట ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు వేముల నాగేందర్‌కు బెస్ట్‌ టీచర్‌ అవార్డు లభించింది. లయన్స్‌క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో బిర్లా ఓపెన్‌మెండ్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానో త్సవం కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నాగేందర్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా ఉత్తమ ఉపాధ్యా యుడు నాగేందర్‌ మాట్లాడుతూ.. అవార్డు లభించినందుకు తనకు సంతోషంగా ఉందని నాపై వృత్తి పరంగా మరింత బాధ్యత పెరిగిందన్నారు. అవార్డు అందుకున్న వేముల నాగేందర్‌ను స్నేహితులు కత్తెర పల్లి వేణు, యాకయ్య, గుండు శ్రీధర్‌, బాసాని శ్రవణ్‌, కత్తెరపల్లి కిరణ్‌, అన్న రాజ్‌కుమార్‌, కమలాకర్‌, కుటుంబసభ్యులు తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో లయన్‌క్లబ్‌ గవర్నర్‌ వెంకటేశ్వర్‌రావు, సభ్యులు, ఉపాధ్యాయులు, ఓపెన్‌ మైండ్స్‌ స్కూల్‌ యాజమాన్యం, ఉపాధ్యా య బృందం తదితరులు పాల్గొన్నారు.