నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్
ప్రజలకు ఇబ్బందులు కలగకుండ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని పండిత్ నెహ్రూ నగర్‌లో ప్లాట్ నెంబర్ 157 నుంచి పండిత్ నెహ్రూ నగర్ కమిటీ హాల్ వరకు జలమండలి ఏఈ విలియం ప్రకాష్, బస్తీ అధ్యక్షులు చాంద్ బారుతో కలిసి ఆమె పాదయాత్ర చేశారు. అనంతరం డ్రయినేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రోజులు నుంచి డ్రయినేజీ పైప్‌లైన్ చిన్నదిగా ఉండడం వల్ల డ్రయినేజీ వాటర్ పొంగి రోడ్డు పైకి రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారన్నారు. దాంతో కొత్త డ్రయినేజీ లైన్ శాంక్షన్ చేయించామన్నారు. బస్తీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొందర్లోనే పనులన్నీ పూర్తవుతాయన్నారు. బస్తీ వాసులు ఆనందంతో సబిహా గౌసిద్దీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్ భారు, సుభాన్, సైలని, అక్బర్, కాదిర్, నజీర్, అమీద్, నరసింహ, తాజ్ బి, తదితరులు పాల్గొన్నారు.