రూ.ఐదు లక్షలతో బాత్‌రూం కూడా నిర్మాణం కాదు

– అలాంటిది కాంట్రాక్టర్‌ డబుల్‌ బెడ్రూమ్‌ కట్టించి ఇచ్చాడు
– పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్‌
ఇప్పుడున్న పరిస్థితులలో రూ.5 లక్షల రూపాయలతో బాత్రూం కూడా నిర్మాణం కాదని..అలాంటిది కాంట్రాక్టర్‌ జనగాం సాంబయ్య డబుల్‌ బెడ్రూమ్‌ లు కట్టించి ఇచ్చాడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు .ఆదివారం ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ గ్రామంలో 22 డబుల్‌ బెడ్‌రూమ్‌లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గృహప్రవేశం చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్‌ బీరం శ్రీలత రామకష్ణారెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అనేక నిధులు తెచ్చి గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేసింది నేనేనని తప్పుడు ప్రచారం చేస్తున్న బిజెపి నేతలను తరిమికొట్టండని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌,బిజెపి పార్టీల నేతలు మేమంటే మేము గెలుస్తామని ఉత్సాహంతో ఊగుతున్నారని వారు గతంలోనే నా చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తుచేశారు.. ఇప్పుడు మళ్లీ వచ్చి ఏం చేస్తారని.. నన్ను ఢకొీట్టే దమ్ము ఉందా ఎవరికన్నా అంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. నిరుపేదలందరికీ గృహాలు ఇచ్చాం, అడిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాం, సీసీ రోడ్లు వేసి గ్రామాలని ఆదర్శంగా తీర్చిదిద్దామని ఇంతకంటే ఇక్కడ చేసేది ఏముందనిన్నారు. కాంగ్రెస్‌ నేతలు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని మీకు కావలసిన పథకాలు మరిన్ని అందిస్తానన్నారు. జనగాం సాంబయ్య సేవలు మరువలేనివని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. పరకాల నియోజకవర్గంలో ఇక్కడ బిజెపికి విత్తనమే లేదని తెల్ల లాగులు వేసుకొని వస్తారు మీ ప్రధానమంత్రి ఏమి చేశారని నిలదీయండని అన్నారు. గ్రామాల్లోకి తిరగకుండా బిజెపి నేతలను తరిమికొట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత రజినీకర్‌, జడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు, డిప్యూటీ తహసీల్దార్‌ బత్తిని సంగీత, డి.ఈ లింగారెడ్డి, ఎఇ లత, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎన్కతాళ్ళ రవీందర్‌, దుంపలపల్లి బుచ్చిరెడ్డి, కంతాల కేశవరెడ్డి, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌ రెడ్డి, వంగాల భగవాన్‌ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు కమల రాజేశ్వరరావు, బలరాం, ఉప సర్పంచ్‌ వీసం శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.