కోదండరాంతో కాంగ్రెస్‌ చర్చలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాంతో కాంగ్రెస్‌ అధినాయకత్వం చర్చలు జరిపినట్టుగా తెలుస్తున్నది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కోదండరాం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఖర్గేను కలిసి తమ పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సుముఖంగా ఉన్నట్టు చెప్పి తమకు ఆరు సీట్లు కేటాయించాలని కోరారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ ఠాక్రేతో చర్చలు జరిపారు. కేసీఆర్‌ను ఓడించడం కోసం కోదండరాం పాత్ర అవసరమని కాంగ్రెస్‌ భావిస్తూ తెలంగాణ జన సమితితో పొత్తు చర్చ జరిపినట్టుగా తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి .ఈ మేరకు కోదండరాం ఆరు సీట్లనూ తమ పార్టీ అభ్యర్థుల కేటాయిం చాలని అందుకు సంబంధించిన జాబితాను ఠాక్రేకు అందజేశారు.