– డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డీఎస్సీ రాతపరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నవంబర్ 30న పోలింగ్ ఉన్నందున అదే రోజు డీఎస్సీ ఎస్జీటీ పరీక్ష ఉందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.