– బిల్లులు విడుదల చేయాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
అప్పులు తెచ్చిన వంట చేసి పాఠశాలల్లో పిల్లల కడుపు నింపిన తమ కడుపు కొట్టొద్దని, బిల్లులు విడుదల చేసి అప్పుల్లో నుంచి గట్టెక్కించాలంటూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో చేపట్టిన ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో మోకాళ్లపై కూర్చొని కార్మికులు నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు సమ్మె కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. సంస్థాన్ నారాయణపురంలో కార్మికులు కండ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని రాస్తారోకో నిర్వహించారు.సమ్మెలో భాగంగా మధ్యాహ్నం భోజన కార్మికులు ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడారు. 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు రూ.2000 వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.