చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

నవతెలంగాణ-భిక్కనూర్:
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న విజయసాయి కెమికల్ ల్యాబ్ లో బుధవారం ప్రమాదవశాత్తు కెమికల్ డ్రమ్ పెలిపోవడంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. గాయాలు అయిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారి కుటుంబానికి నష్టపరిహారం, గాయాలైన వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపారు.