నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ లో గురువారం వైస్ ప్రిన్సిపాల్ గా సోషల్ వర్క్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో బాధితులు అప్పగించిన వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ, రిజిస్టర్ యాదగిరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వరి సోషల్ వర్క్ విభాగ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు.