హలో బీసీ…చలో గాంధీభవన్‌

–  కాంగ్రెస్‌ నేత చెరుకు సుధాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలు ఇస్తామన్న హామీ ప్రకారం నెరవేర్చాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌ కోరారు.గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేత కత్తి వెంకటస్వామితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. హలో బీసీ…చలో గాంధీభవన్‌ పేరుతో శుక్రవారం గాంధీ భవన్‌లో దీక్ష చేస్తామన్నారు. బీసీలే కాకుండా సామాజిక న్యాయం కావాలని కోరుకునేవారంతా దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు ఇస్తామన్న స్థానాలు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ అధికారంలోకి రాదన్నారు. కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం, ఓబీసీల వాటానే ముఖ్యమన్నారు.