మిగిలిన మెడికల్‌ పీజీ సీట్ల భర్తీకి

– అదనపు మాపప్‌ రౌండ్‌ నిర్వహించాలి :రిజ్వీకి హెచ్‌ఆర్‌డీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెడికల్‌ పీజీ సీట్లలో మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు అదనపు మాపప్‌ రౌండ్‌ నిర్వహించాలని హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అధ్యక్షులు కె.మహేశ్‌ కుమార్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీతో పాటు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. మెడికల్‌ పీజీ సీట్లలో 74 క్లినికల్‌, 90 నాన్‌-క్లినికల్‌ సీట్లు భర్తీ కాలేదని తెలిపారు. మాపప్‌ ఫేస్‌ తర్వాత ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్‌ చేయని కారణంగా ఇవి ఖాళీగా ఉండిపోయాయని వివరించారు. ఈ సీట్లు ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఉన్నాయని తెలిపారు.