నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం నివేదిక సమర్పించారు. ఆయా పేర్లను పరిశీలించి, శుక్రవారం ఈసీ కొత్త వారిని సూచించనుంది. ఆ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేస్తారు.